తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల


తిరుమల , 30 జూలై (హి.స.) కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, టోకెన్లు లేని భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని స్వామివారి సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీరు, అల్పాహారం, పాలు నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే నిన్న(బుధవారం) ఒక్కరోజే మొత్తం 74,471 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,319 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.68 కోట్లు లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సహనంతో వ్యవహరించాలని, టీటీడీ సిబ్బంది సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande