మన్యం.వీరుడు అల్లూరి శ్రీరామరాజు జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్.కళ్యాణ్ నివాళులు
మన్యం.వీరుడు అల్లూరి శ్రీరామరాజు జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్.కళ్యాణ్ నివాళులు
pawan kalyan


అమరావతి, 04 జూలై (హి.స.)

మన్యం వీరుడు సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి, గిరిజన ప్రజల హక్కులు, గౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande