ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ చంద్రశేఖర్
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ చంద్రశేఖర్
Collector


నల్గొండ, 04 జూలై (హి.స.)

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను బీఎల్ఎలు, అధికారులు సమిష్టిగా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని నందిపాడులో ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. అర్హులైన వారి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా బీఎల్ఎలు ఇంటింటి సర్వేలో నమోదు చేయాలని సూచించారు. రాజకీయ పక్షాల నాయకులు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫారాలు నింపి క్రమంలో నిరక్షరాస్యులు ఉన్నట్లయితే బి ఎల్ ఓ బాధ్యత తీసుకుని సరైన సమాచారాన్ని ఓటర్ల నుండి తీసుకుని ఫారాలను పూర్తి చేసి అప్లోడ్ చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande