
హైదరాబాద్, 04 జూలై (హి.స.)
ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయాలంటూ
దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డెక్కారు. 20వేల పోలీస్ ఉద్యోగాలు వేయాలని తాము కోరుతుంటే 5వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నారని మండిపడ్డారు. 5వేల ఉద్యోగాలే అడుగుతున్నారని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు వేయమని కోరితే రేవంత్ రెడ్డి పురుగుల మంది తాగి చనిపోండి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని అన్నారని, దానికి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఫిర్యాదు తీసుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగేందుకు డబ్బులు లేవని ఆ డబ్బులైనా రేవంత్ రెడ్డి కొట్టాలని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆందోళనతో దిల్సుఖ్నగర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..