ప్రజల ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యం.. విజయ సునీత
ప్రజల ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యం.. విజయ సునీత
మ


మార్కాపురం, 04 జూలై (హి.స.) : ప్రజలకు మరింత మెరుగైన ఫిర్యాదుల పరిష్కార సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న పీజీఆర్ఎస్ భవనానికి జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా స్వీకరించి, పారదర్శకంగా పరిష్కరించే విధంగా పీజీఆర్ఎస్ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రజలకు ఒకేచోట మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు.

ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ఈ భవనం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande