‘మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి’
‘మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి’
‘మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి’


హైదరాబాద్, 04 జూలై (హి.స.)

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మ‌డి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఈగ నాగన్న ఆధ్వర్యంలో మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్, నాగన్న, వినయ్, సుభాష్ పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande