జగన్ చెబుతున్న 'మావిగన్'... తూటా లేని గన్: లంకా దినకర్
జగన్ చెబుతున్న 'మావిగన్'... తూటా లేని గన్: లంకా దినకర్
jagan


అమరావతి, 04 జూలై (హి.స.)

వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేత, ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని అంశంపై జగన్‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. ‘మావిగన్’ అనేది తూటా లేని గన్‌ అని... ఆ గన్ పేలదంటూ సెటైర్ వేశారు. “నిన్న మూడు రాజధానులు మా నినాదం అన్నారు. ఈరోజు మావిగన్ మా నినాదం అంటున్నారు. రేపు ఏం చెబుతారో తెలియదు. 'అయోమయం జగన్నాధం మా నినాదం' అనే విధంగా జగన్ తీరు ఉంది” అంటూ ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ సంకల్పం వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పిన లంకా దినకర్... జగన్ సంకల్పం మాత్రం ‘వినాశక ఏపీ’ అని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని... పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు, హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ, మార్కాపురం తదితర ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జగన్ ఈ అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ‘మావిగన్’ వంటి విషం కక్కుతున్నారని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande