
అయోధ్య, 08 జూలై (హి.స.)
: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయ విరాళాల చోరీ వివాదంపై ఆ రాష్ట్ర మంత్రి సంజయ్ నిషాద్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఎంతటి ‘ధురంధరుడు’ (ప్రభావశీలురు) లేదా ‘చందా చోర్’ (చందా దొంగలు) ఉన్నా సరే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. విరాళాల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెద్ద పెద్ద మతపరమైన సంస్థలు, ఆలయాలకు వచ్చే కానుకలు, విరాళాలను పర్యవేక్షించడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. బలమైన చట్టపరమైన నిబంధనలు ఉంటేనే ఇలాంటి చందా దొంగతనాలకు అడ్డుకట్ట వేయగలమని అభిప్రాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 15 రోజుల సమయాన్ని నిర్దేశించారని, అప్పటివరకు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ముఖ్యమంత్రిపై పూర్తి నమ్మకం ఉంచాలని, ఎంతటి శక్తివంతులైనా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని మంత్రి సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. ఈ విరాళాల కుంభకోణంపై ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా విచారణ జరుపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi