అరటి పువ్వుతో అద్భుతమైన ఆరోగ్యం.. దొరికితే వదిలిపెట్టకండి!
అరటి పువ్వుతో అద్భుతమైన ఆరోగ్యం.. దొరికితే వదిలిపెట్టకండి!
అరటి పువ్వుతో అద్భుతమైన ఆరోగ్యం.. దొరికితే వదిలిపెట్టకండి!


కర్నూలు, 09 జూలై (హి.స.) అరటిపండు దాదాపు అందరికీ ఇష్టమైన , ఆస్వాదించి తినే పండు. అరటిపండ్లు అత్యంత పోషకమైనవి అయినప్పటికీ అరటి పువ్వు ఇంకా గొప్ప ప్రయోజనాలను అందిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు.అరటిపండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పోషకాహార నిపుణులు శివప్ప ఎన్. అభిప్రాయం ప్రకారం.. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. అరటి పువ్వు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . అంతే కాదు ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అరటి పువ్వుతో వివిధ ప్రాంతాల్లో ఎన్నో రుచికరమైన వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇన్ని ఉపయోగాలున్న ఈ పువ్వు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

టైప్ 2 డయాబెటిస్ రోగులకు అరటి పువ్వు ఒక దివ్య ఔషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా డయాబెటిస్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఈ పువ్వును క్రమం తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

అరటిపండ్లలో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు ఒత్తిడిని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. నిరాశ సంబంధిత సమస్యల నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

అరటి పువ్వు ఒక అద్భుతమైన ‘నాచురల్ డయాబెటిక్ ఏజెంట్’ గా పనిచేస్తుంది. అంటే ఇది శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్లను మూత్రం ద్వారా బయటకు పంపేలా చేస్తుంది.

మహిళలను వేధించే పీరియడ్స్ నొప్పులు, అధిక రక్తస్రావం పిసిఓడి సమస్యలకు అరటి పువ్వు ఒక పవర్ఫుల్ మెడిసిన్.

ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలను పెంచి, గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో తోడ్పడుతుంది.

మన దేశంలో చాలా మంది మహిళలు రక్తహీనత (రక్తం తక్కువగా ఉండటం) తో బాధపడుతున్నారు. అరటి పువ్వులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. దీనిని కూరగా వండుకుని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరిగి నీరసం, అలసట మాయమవుతాయి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande