
న్యూఢిల్లీ, 09 జూలై (హి.స.)
:భారత సైన్యానికి చెందిన సుమారు 1,600 కోట్ల రూపాయల విలువైన 840 లోయిటరింగ్ మ్యునిషన్స్ కొనుగోలు టెండర్‌లో దేశీయ
సంస్థలు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL), నిబే లిమిటెడ్ అతి తక్కువ ధరను కోట్ చేసిన కంపెనీలుగా (Lowest Bidders) నిలిచాయి. 100 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ డ్రోన్ల
సరఫరా కోసం నిర్వహించిన టెక్నికల్ ఎవాల్యుయేషన్‌లో కేవలం మూడు కంపెనీలు మాత్రమే
అర్హత సాధించగా, ధరల బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ ఎల్-1 (L-1) గా నిలిచింది.
ఈ
టెండర్ నిబంధనల ప్రకారం, ఎల్-1 గా
నిలిచిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మొత్తం ఆర్డర్‌లో 64 శాతం (సుమారు రూ.1,000 కోట్లు) డ్రోన్లను సరఫరా చేయనుంది.
అలాగే రెండో అతి తక్కువ ధర కోట్ చేసిన ఎల్-2 (L-2) సంస్థ నిబే డిఫెన్స్ మిగిలిన 36 శాతం
(సుమారు రూ.600 కోట్లు) డ్రోన్లను సరఫరా చేసే అవకాశం
ఉంది. త్వరలోనే ఆర్మీ అధికారులు ఈ రెండు కంపెనీలను తుది ధరల చర్చల (Price Negotiations) కోసం పిలవనున్నారు.
ఆధునిక
యుద్ధ తంత్రానికి అనుగుణంగా ఇండియన్ ఆర్మీ తన ఆర్టిలరీ విభాగాన్ని డ్రోన్
బ్యాటరీలతో ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా కేవలం డ్రోన్ వార్‌ఫేర్ కోసమే
శక్తిబాన్ రెజిమెంట్లు, దివ్యాస్త్ర బ్యాటరీలు, భైరవ్ బెటాలియన్లను రంగంలోకి దించుతోంది.
సైన్యం మొత్తం మీద ఒక లక్ష డ్రోన్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, రాబోయే 12-18 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 50 కిమీ నుండి 1,000 కిమీ పరిధి గల డ్రోన్లను ఆర్టిలరీ
డైరెక్టరేట్ చేర్చుకోనుంది. దీనితో పాటు రూ.1,500
కోట్ల విలువైన మరో 36 జెట్ ఆధారిత డ్రోన్ల టెండర్‌ను కూడా
ఆర్మీ త్వరలో తీసుకురానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi