
అయోధ్య, 09 జూలై (హి.స.)
:రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై
జరుగుతున్న దర్యాప్తుపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు మహంత్
దినేంద్ర దాస్ గురువారం స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులపై, పరిపాలనా యంత్రాంగంపై తమకు పూర్తి నమ్మకం
ఉందని పునరుద్ఘాటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అనుకల్ప్ మిశ్రాను అయోధ్య
పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడం ప్రారంభించిన తరుణంలో ఆయన ఈ ప్రకటన
చేశారు.
దొంగతనం
చేసిన వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పట్టుబడతారని, వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని దాస్ విలేకరులతో అన్నారు. కోర్టు
అనుమతితో ఈ కేసులో సహ నిందితులు లవకుష్ మిశ్రా, కరుణేష్
పాండేలను కూడా ఏడు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని లోతైన ఆర్థిక అక్రమాలపై
దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. విరాళాల భద్రత మరియు ఆలయ నిర్వహణపై ఎలాంటి
ఆందోళనలు అవసరం లేదని, దైనందిన కార్యకలాపాలు ఎప్పటిలాగే
సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ
కేసుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ మహంత్ దినేంద్ర దాస్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతిపక్ష నాయకులు కేవలం
రాజకీయం చేస్తున్నారని, వారు రాముడి నిజమైన భక్తులు కారని
దుయ్యబట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక వైరాగి అని, ఆయనను ఎవరూ కొనలేరని, ఆయన
నేతృత్వంలో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ట్రస్టీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రత్యేక విచారణ బృందం (SIT)
దర్యాప్తును వేగవంతం చేసిందని, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఎవరినీ
వదిలిపెట్టేది లేదని యూపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi