గ్రామీణ క్రీడలను.ప్రోత్సహిస్తూ ఈశా.ఫౌండేషన్ నిర్వహిస్తున్న వడ్డేశ్వరం కే ఎల్ యూనివర్సిటీలో
తాడేపల్లి, 10 ఆగస్టు (హి.స.) గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ ఈశా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈశా గ్రామోత్సవం ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగింది. క్లస్టర్ స్థాయిలో పురుషుల వాలీబాల్, మహిళల త్రో బ
గ్రామీణ క్రీడలను.ప్రోత్సహిస్తూ ఈశా.ఫౌండేషన్ నిర్వహిస్తున్న  వడ్డేశ్వరం కే ఎల్ యూనివర్సిటీలో


తాడేపల్లి, 10 ఆగస్టు (హి.స.)

గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ ఈశా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈశా గ్రామోత్సవం ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగింది. క్లస్టర్ స్థాయిలో పురుషుల వాలీబాల్, మహిళల త్రో బాల్ మ్యాచ్ల్లో విజయం సాధించిన 18 జట్లు ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాయి. ఏపీ నలుమూలల నుంచి 8800 మందికి పైగా క్రీడాకారులు హాజరు కాగా, వీరిలో 2500 మంది మహిళలు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన జట్లకు వచ్చే నెల 6వ తేదీన కోయంబత్తూరులో జాతీయ స్థాయిలో ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని ఏపీ ఈశా గ్రామోత్సవ కోఆర్డినేటర్ స్వామి అంబర తెలిపారు. టోర్నమెంట్ మొత్తం మీద కోటి రూపాయల ప్రైజ్మనీ ఇస్తున్నట్టు తెలిపారు.

డివిజినల్ రౌండ్ (స్టేట్ ఫైనల్) పురుషుల వాలీబాల్ పోటీలో ఏలూరు జట్టు కాకినాడ జట్టుపై విజయం సాధించి ప్రథమస్థానం సాధించింది. తృతీయ స్థానాన్ని విశాఖపట్నం, నాలుగో స్థానాన్ని రాజమండ్రి జట్టు సాధించాయి. మహిళల త్రోబాల్లో విఖాఖపట్నంకు చెందిన శ్రీరామ జట్టు ప్రథమ స్థానాన్ని సాధించగా, ద్వితీయ స్థానాన్ని విశాఖపట్నంకు చెందిన ఆంజనేయ జట్టు సాధించాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande