
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇవాళ మధ్యాహ్నం భారీ ఎత్తున జరిపిన తనిఖీల్లో సుమారు 1.2 కోట్ల రూపాయల విలువైన స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి కస్టమ్స్ ఇంటెలిజెన్స్ విభాగం సోదాలు నిర్వహించింది. వారు తాము ధరించిన దుస్తుల లోపల, షూస్ సోల్స్‌లో ప్రత్యేక అరలు కుట్టించి, వాటిలో ద్రవరూపంలో (Paste Form) మార్చిన బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం బరువు సుమారు 1.8 కేజీలుగా తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏ బంగారం వ్యాపారికి దీనిని చేరవేసేందుకు వీరు ప్లాన్ చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi