రైతుబీమా ప్రీమియంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం: సచివాలయం వద్ద ఉద్రిక్తత, హరీష్ రావు అరెస్ట్
రైతుబీమా ప్రీమియంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం: సచివాలయం వద్ద ఉద్రిక్తత, హరీష్ రావు అరెస్ట్
harish rao


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో రైతుబీమా గడువు ముగిసినప్పటికీ కొత్త ప్రీమియం నిధులు ఎల్‌ఐసీకి చెల్లించకపోవడంపై ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు భద్రత కరువైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం సచివాలయం (Secretariat) ముట్టడికి యత్నించారు. వందలాది మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర నెట్టులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, సాంకేతిక కారణాల వల్లే ఆలస్యమైందని, సోమవారం ఉదయానికల్లా ప్రీమియం నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి వివరణ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande