
ముంబై, 10 ఆగస్టు (హి.స.) గత వారమంతా బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 8 శాతం పెరుగుదల కనిపించింది. యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచబోదన్న అంచనాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ వారం కూడా దేశంలో ధరల పెరుగుదల కొనసాగి రూ.1.6 లక్ష మార్కుకు చేరువయ్యే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటను ఇచ్చాయి. గత కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఆదివారంతో పోల్చిలే బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనిపించింది. కాబట్టి సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇవే
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,540 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,840 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,990 వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV