
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల
సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం (Vande Mataram) గీతాలాపన అంశంపై వివాదం రాజుకుంది. రాజస్థాన్లోని చిత్తూరుఘడ్ (Chittorgarh)లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ టార్గెట్గా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్లో జాతీయ గీతం వందేమాతరం ఆలపిస్తుండగా, మధ్యలోనే ఆపేయాలని సోనియా గాంధీ (Sonia Gandhi) పార్టీ అధ్యక్షుడికి సూచించారని అమిత్ షా ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే జాతీయ గేయాన్ని అవమానించిందని.. అందుకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని కామెంట్ చేశారు. ఈ ఘటనపై సోనియా గాంధీ 140 కోట్ల భారతీయులకు, అలాగే వందేమాతరం రచయిత బంకిం చంద్ర ఛటర్జీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు