ఏపీలో కీలక అధికారుల బదిలీ నిషేధం
ఏపీలో కీలక అధికారుల బదిలీ నిషేధం
ఏపీలో కీలక అధికారుల బదిలీ నిషేధం


అమరావతి, 10 ఆగస్టు (హి.స.)

ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధాన్ని అక్టోబర్ 3 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కీలక అధికారుల బదిలీలకు బ్రేక్ పడనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు జులై 1, 2026 అర్హత తేదీగా నిర్ణయించారు. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.

దీని ప్రకారం, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈసీ సవరించిన షెడ్యూల్ నేపథ్యంలో బదిలీల నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నిర్ణయం ప్రకారం ఎన్నికల జాబితా సవరణకు సంబంధించిన కీలక అధికారులు అక్టోబర్ 3 వరకు అదే స్థానాల్లో కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేరుతోG.O.Rt.No.1545 జారీ అయ్యింది.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande