
అమరావతి, 10 ఆగస్టు (హి.స.)
రాజమహేంద్రవరంలో ఈ నెల 3న ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక(28) హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పూర్కు చెందిన వెంకటేశ్, చంద్రకళ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక రాజానగరంలోని జీఎస్ఎల్ మెడిసిన్ పీజీ చదువుతున్నారు. రాజమహేంద్రవరంలోని ప్రసాద్ఆదిత్య మాల్ వద్ద ఈ నెల 3న సహచర విద్యార్థితో కలిసి సినిమా చూసి తిరిగి బైక్పై తిరిగివస్తుండగా.. మద్యం మత్తులో నిందితులు ధశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ కారును ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వారిని మూడు దఫాలు ఢీకొట్టి.. కింద పడిన ఆమెపై నుంచి కారు ఎక్కించారు. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. తల, ముఖం, చెవులు, ముక్కుతోపాటు తల లోపల భాగాలూ దెబ్బతినడంతో తీవ్రరక్తస్రావమైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ