రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ ష రీన్ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా మృతి
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ ష రీన్ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా మృతి
Chandrababu Naidu(file)


అమరావతి, 10 ఆగస్టు (హి.స.)

రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా.. 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షరీన్ బేగం, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande