లండన్లో మంత్రి నారాయణ బృందం.. అమరావతి ఐకానిక్ భవనాలపై కీలక చర్చలు
లండన్లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు మంత్రి.. లండన్ వెళ్లారు.
నారాయణ


లండన్, 10 ఆగస్టు (హి.స.)లండన్లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు మంత్రి.. లండన్ వెళ్లారు. అధికారిక పర్యటన కోసం నిన్న(ఆదివారం) రాత్రి మంత్రి, అధికారులు లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వెలుపలి డిజైన్లపై(FACADE) అక్కడి అధికారులతో చర్చించనున్నారు. ఐకానిక్ భవనాల డిజైన్లు అందించిన నార్మన్ అండ్ ఫోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్ కన్సల్టెన్సీ, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో జరిపే సమావేశంలో నారాయణ పాల్గొననున్నారు.

అసెంబ్లీపై భాగంలో నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చించనున్నారు. అమరావతి రాజధానిని అసెంబ్లీ భవనం పైన నిర్మించే టవర్(sphere) ద్వారా వీక్షించేలా టూరిస్ట్ ప్రాంతంగా ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే నిర్మాణాలు జరుగుతున్న తీరుతో పాటు భవిష్యత్తులో ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రక్రియపై ఆర్కిటెక్ట్లు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి చర్చించనున్నారు. మంత్రి వెంట సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజినీర్లు లండన్ వెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande