సీబీ ఎస్ ఈ సౌత్ జోన్ -1 హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిసాయి
సీబీ ఎస్ ఈ సౌత్ జోన్ -1 హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిసాయి
సీబీ ఎస్ ఈ సౌత్ జోన్ -1 హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిసాయి


అమరావతి, 10 ఆగస్టు (హి.స.)

: సీబీఎస్ఈ సౌత్ జోన్ -1 హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. చివరి రోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ ఎన్.సి.సి. గ్రూప్ కమాండర్ నితిన్ మోహన్ అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు వెలికితీసేందుకు, మంచి క్రమశిక్షణ అలవరచు కోవడానికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎంచుకున్న రంగం ఏదైనా కస్టపడి పని చేయాలని.. నేటి యువతే మన దేశానికి భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు పతకాలు, జ్ఞాపికలను అందచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande