22-ఏ సమస్యకు తక్షణ పరిష్కారం.. 830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఊరట
22-ఏ సమస్యకు తక్షణ పరిష్కారం.. 830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఊరట
Chandrababu Naidu(file)


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ పరిష్కారం చూపారు. సోమవారం ఆయన ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం కోసం విచ్చేశారు. ఈ సందర్భంగా, తమ భూములు 22-ఏ నిషేధిత జాబితాలో చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు, మాజీ సైనికులు సీఎం దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే ఆ జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు హక్కుగా సంక్రమించిన భూములను 22-ఏ జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు చేసుకోలేక, అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న చంద్రబాబు, ప్రజలకు మేలు చేసేలా అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande