వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్లో బసంత్ న్యూ రికార్డ్స్
వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ బసంత్ కుమార్ మేఘ్వాల్ అద్భుత ప్రదర్శనతో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు.
basant-sets-new-records-in-world-under-20-athletics-57


ఢిల్లీ, 10 ఆగస్టు (హి.స.) వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ బసంత్ కుమార్ మేఘ్వాల్ అద్భుత ప్రదర్శనతో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. హైజంప్ విభాగంలో రజత పతకాన్ని (Silver Medal) కైవసం చేసుకుని, ఈ ప్రపంచ టోర్నీలో హైజంప్లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. 19 ఏళ్ల బసంత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో 2.21 మీటర్ల ఎత్తు దూకి రెండవ స్థానంలో నిలిచాడు. పోటీలో అల్జీరియాకు చెందిన యూన్స్ అయాచి, బ్రిటన్కు చెందిన ఓటిస్ పూల్ కూడా సరిగ్గా 2.21 మీటర్ల ఎత్తునే దాటడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ ముగ్గురు అథ్లెట్లు తర్వాత టార్గెట్ 2.24 మీటర్లను దాటడంలో విఫలమవ్వడంతో, అంతకుముందు వారు సాధించిన స్కోర్ (countback rule) ఆధారంగా స్థానాలను ఖరారు చేశారు. ఇందులో భాగంగా యూన్స్ అయాచి స్వర్ణ పతకం గెలవగా, బసంత్ కుమార్కు రజతం, ఓటిస్ పూల్కు కాంస్య పతకం దక్కాయి.

భారత మాజీ జాతీయ రికార్డు హోల్డర్ సహానా కుమారి శిక్షణలో రాటుదేలిన బసంత్ కుమార్, ఈ టోర్నీలో ఊహించని రీతిలో రాణించాడు. అంతకుముందు వరకు అతడి వ్యక్తిగత ఉత్తమ రికార్డు (Personal Best) 2.11 మీటర్లుగా ఉండగా, సహానా మార్గదర్శకత్వంలో తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఏకంగా 10 సెంటీమీటర్లు అధికంగా దూకి 2.21 మీటర్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచ స్థాయిలో భారత్ పేరును నిలబెట్టిన బసంత్ సాధించిన ఈ చారిత్రక విజయం దేశంలోని యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande