
యాదగిరిగుట్ట, 10 ఆగస్టు (హి.స.)
–
వరుస సెలవులు మరియు శ్రావణ మాస పూజల నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈరోజు ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. కొండపైకి వచ్చే వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీసులను పెంచామని, కొండపై తాగునీరు మరియు షెల్టర్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినట్లు ఆలయ ఈఓ (EO) ఈరోజు ఉదయం మీడియాకు వివరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi