
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న కొండాపూర్ ప్రాంతంలో యువత మరియు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక ప్రమాదకరమైన డ్రగ్స్ నెట్‌వర్క్‌ను గచ్చిబౌలి పోలీసులు మరియు నార్కోటిక్స్ కంట్రోల్ టీమ్ సంయుక్తంగా ఛేదించాయి
ధారణ చాక్లెట్ల రూపంలో గంజాయిని కలిపి విక్రయిస్తున్న ఒక ప్రధాన నిందితుడిని పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు, అతని వద్ద నుండి సుమారు 4.2 కిలోల బరువైన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుండి ఈ మత్తు చాక్లెట్లను నగరానికి తీసుకువచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఆర్డర్లు తీసుకుంటూ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, నగరంలో వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని తీవ్రంగా విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi