నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు పోటెత్తిన పసుపు క్వింటాల్ ధర రికార్డు స్థాయి
నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు పోటెత్తిన పసుపు క్వింటాల్ ధర రికార్డు స్థాయి
pasupu


నిజామాబాద్, 10 ఆగస్టు (హి.స.)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభం కావడంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు ఈరోజు ఉదయం నుండి రైతులు భారీగా పసుపు పంటను తరలించారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ఈరోజు వేలంలో పసుపు క్వింటాల్ ధర రికార్డు స్థాయి ధరను పలికినట్లు మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. ధర బాగుండటంతో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర నుండి కూడా రైతులు తమ పంటను ఇక్కడికే తీసుకువస్తున్నారు. రైతులకు ఎలాంటి బ్రోకరేజ్ ఇబ్బందులు లేకుండా ఈ-నామ్ (e-NAM) పద్ధతి ద్వారా పారదర్శకంగా డిజిటల్ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande