
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
– ఉట్నూర్ (ఆదిలాబాద్)
వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మరియు గిరిజన గూడాలలో డెంగ్యూ, మలేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఉదయం నుండి ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించింది. ఉట్నూర్ ఐటీడీఏ (ITDA) పరిధిలోని లోతట్టు గ్రామాలకు మొబైల్ మెడికల్ టీమ్‌లను రంగంలోకి దించి భక్తులకు, స్థానికులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారు. తాగునీటి బావుల వద్ద క్లోరినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడంతో పాటు, పరిశుభ్రతపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం మండల కేంద్రాల్లోని ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్లను సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi