
తిరుమల, 10 ఆగస్టు (హి.స.)తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో ఫుల్ అవ్వగా.. స్వామివారి దర్శనం కోసం శిలాతోరణం వరకూ క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4-6 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (ఆదివారం) శ్రీవారిని 87,179 మంది భక్తులు దర్శించుకోగా.. 34,256 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు సమకూరింది. 4.03 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV