హైదరాబాద్ నగర శివార్లలో అర్ధరాత్రి వేళ ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం
హైదరాబాద్ నగర శివార్లలో అర్ధరాత్రి వేళ ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం
accident


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ నగర శివార్లలో అర్ధరాత్రి వేళ ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది, ఈ ఘటనలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బాధిత వ్యక్తులు రోడ్డు పక్కన వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం వీరిని బలంగా ఢీకొట్టి, ఆపకుండా వేగంగా దూసుకెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని మరియు నిందితుడిని గుర్తించడానికి ఆ మార్గంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande