
జయశంకర్ భూపాలపల్లి, 10 ఆగస్టు (హి.స.)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ (మేడిగడ్డ) కుంగిన పిల్లర్ల పునరుద్ధరణ మరియు తాత్కాలిక రక్షణ చర్యలపై జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) నిపుణుల బృందం ఈరోజు ఉదయం క్షేత్రస్థాయిలో సాంకేతిక తనిఖీలు చేపట్టింది. గోదావరి నది నుండి వస్తున్న వరద ప్రవాహ తీవ్రత బ్యారేజ్ పునాదులపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకునేందుకు అత్యాధునిక సెన్సార్ పరికరాల ద్వారా రీడింగులను నమోదు చేశారు. బ్యారేజ్ వద్ద నది ప్రవాహాన్ని సురక్షితంగా దిగువకు పంపేందుకు గేట్ల నిర్వహణపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు నిపుణులు పలు సూచనలు చేశారు. శాశ్వత మరమ్మతుల నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని బృందం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi