
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవనం మరియు సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఈరోజు ఉదయం క్షేత్రస్థాయి డ్రోన్ సర్వేను ముమ్మరం చేశారు. నది పరివాహక ప్రాంతాలలో ఉన్న అక్రమ కట్టడాలను, వ్యర్థాలు పేరుకుపోయిన ప్రాంతాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా గుర్తిస్తున్నారు. నదిలోకి మురుగునీరు నేరుగా చేరకుండా నిర్మించే ఎస్టీపీ (STP) ప్లాంట్ల స్థల పరిశీలనను కూడా ఇంజనీరింగ్ విభాగం పూర్తి చేసింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ వల్ల నగరంలో పర్యావరణ సమతుల్యత పెరగడంతో పాటు పర్యాటకంగా మూసీ తీరం అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi