
కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) 10 ఆగస్టు (హి.స.)
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల నుండి నీటిని తోడేసే ప్రక్రియను పూర్తి చేసి, ఈరోజు ఉదయం నుండి బొగ్గు ఉత్పత్తిని అధికారులు విజయవంతంగా పునఃప్రారంభించారు. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు పరిధిలోని గనుల్లో భారీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపి, బొగ్గు రవాణాకు రహదారులను పునరుద్ధరించారు. వర్షాల వల్ల నిలిచిపోయిన ఉత్పత్తి లోటును భర్తీ చేయడానికి కార్మికులు మూడు షిఫ్టుల్లో అదనపు గంటలు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూసేందుకు రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణాను ముమ్మరం చేసినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi