
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు, ఆస్తి యజమానులు మరియు బాధితులు తమ నిరసనను ఉధృతం చేశారు.ఈ ప్రాజెక్ట్ వల్ల దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లు, జీవనాధారమైన వ్యాపార సముదాయాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, రేపు (ఆగస్టు 11) జేఏసీ (JAC) ఆధ్వర్యంలో ఒక రోజు భారీ నిరాహార దీక్షకు దిగుతున్నారు.అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వారు డిమాండ్ చేస్తున్నారు; అలాగే ప్రభుత్వం ఇచ్చే పరిహారం మార్కెట్ ధరలకు అనుగుణంగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi