
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
ఫెలోషిప్ నిధుల విడుదల మరియు హాస్టల్ వసతుల కల్పనలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం (అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్) ముందు రీసెర్చ్ స్కాలర్స్ ఈరోజు ఉదయం ధర్నా నిర్వహించారు. గత కొన్ని నెలలుగా రీసెర్చ్ గ్రాంట్లు అందకపోవడం వల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, లైబ్రరీలలో అధునాతన మౌలిక వసతులు కల్పించడంలో వర్సిటీ యాజమాన్యం విఫలమైందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైస్ చాన్సలర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అడ్డుకోవడంతో క్యాంపస్ పరిసరాల్లో కొంత సమయం పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi