రాజధాని అమరావతి పరిధిలో అంతర్గత రహదారుల పనుల పునఃప్రారంభం
రాజధాని అమరావతి పరిధిలో అంతర్గత రహదారుల పనుల పునఃప్రారంభం
రాజధాని అమరావతి పరిధిలో అంతర్గత రహదారుల పనుల పునఃప్రారంభం


తుళ్లూరు (గుంటూరు), 10 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడంలో భాగంగా సీఆర్డీఏ (CRDA) ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తుళ్లూరు మరియు పరిసర గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. గత కొన్ని ఏళ్లుగా నిలిచిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధాన పనులతో పాటు, సచివాలయం మరియు హైకోర్టుకు వెళ్లే ప్రధాన మార్గాల విస్తరణ పనులకు యంత్రాలను రంగంలోకి దించారు. ఈ పనులను సిఆర్డిఏ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలలో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూములు ఇచ్చిన స్థానిక రైతులు పనులు తిరిగి ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande