నాగార్జున సాగర్ లో మహా వరుణ యాగం
నాగార్జున సాగర్ లో మహా వరుణ యాగం
varuna


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలన్నీ నిండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ వేదికగా 'మహా వరుణ యాగం' ప్రారంభమైంది.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక్ష పర్యవేక్షణలో, సుమారు 50 మందికి పైగా వేద పండితుల ఆధ్వర్యంలో 11 హోమగుండాలతో ఈ ఆధ్యాత్మిక క్రతువును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, వ్యవసాయ రంగానికి నీటి కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా సాగుతున్న ఈ యాగంలో ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు, ఈ యాగం ద్వారా రాష్ట్రం మరింత సుభిక్షంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. [1]

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande