గామన్ బ్రిడ్జి సమీపంలో ఓ యువతి మృతదేహం
గామన్ బ్రిడ్జి సమీపంలో ఓ యువతి మృతదేహం
గామన్ బ్రిడ్జి సమీపంలో ఓ యువతి మృతదేహం


రాజమండ్రి,, 11 ఆగస్టు (హి.స.)

:నగర శివారు మండలం కాతేరు ప్రాంతం గామన్ బ్రిడ్జ్ సమీపంలో ఓ యువతి మృతదేహంతోపాటు కొన ఊపిరితో ఉన్న యువకుడిని మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వారు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కొన ఊపిరితో ఉన్న యువకుడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువకుడు కోటిలింగాల పేటకు చెందిన అభిలాష్.. శాంతినగర్కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనకు ముందు వీరిద్దరూ అక్కడికి ఎలా వచ్చారు? ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande