విజయవాడ తిరుపతి లోని.ప్రాంతీయ పాస్పోర్ట్.కార్యాలయాల్లో పనిచేయని సర్వర్లు
విజయవాడ తిరుపతి లోని.ప్రాంతీయ పాస్పోర్ట్.కార్యాలయాల్లో పనిచేయని సర్వర్లు
విజయవాడ తిరుపతి లోని.ప్రాంతీయ పాస్పోర్ట్.కార్యాలయాల్లో పనిచేయని సర్వర్లు

అమరావతి, 11 ఆగస్టు (హి.స.)

: విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. అక్కడికి వచ్చిన ప్రజలను బుధవారం రావాలని అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున ప్రజలు ఉదయం నుంచీ పడిగాపులు కాస్తున్నారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నారు. కేటాయించిన స్లాట్ ప్రకారం వచ్చామని.. సాంకేతిక సమస్యపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande