ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం


భీమవరం , 11 ఆగస్టు (హి.స.)

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో ఆ ప్రేమ జంట దూకింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. ఆ జంట కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే కాలవలోకి దూకి యువకుడిని కాపాడారు. యువతి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

యువతి కోసం వారంతా గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, భీమవరంకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ ఆత్మహత్యయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande