
ప్రయాగ్‌రాజ్, 11 ఆగస్టు (హి.స.)
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ కేంద్రాంగా ఉన్న అలహాబాద్ హైకోర్టు ఈరోజు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది. ఆగ్రాకు చెందిన ఇద్దరు హిందూ సోదరీమణులు తమ సొంత ఇష్టపూర్వకంగా ఇస్లాం మతాన్ని స్వీకరించగా, వారి తండ్రి దీనిని వ్యతిరేకిస్తూ వారిని ఇంటిలోనే బలవంతంగా నిర్బంధించారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.
రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన ఏ పౌరుడైనా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉందని, వయోజనులైన మహిళలను వారి తల్లిదండ్రులు సైతం గృహ నిర్బంధంలో ఉంచడం పూర్తిగా చట్టవిరుద్ధం అని కోర్టు తేల్చి చెప్పింది. బాధితుల ప్రాథమిక హక్కులను హరించినందుకు గాను వారికి రూ. 25 లక్షల భారీ పరిహారాన్ని చెల్లించాలంటూ అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ఇటు వారి తండ్రికి కోర్టు గట్టి ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi