
శ్రీనగర్: , 11 ఆగస్టు (హి.స.)
జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LoC) పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలు ఈరోజు ఉదయం జరిపిన సంయుక్త తనిఖీల్లో భారీగా ఆయుధాలు మరియు మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుండి అందిన ముందస్తు సమాచారం మేరకు భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఒక రహస్య స్థావరంపై దాడి చేశారు. తీవ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు మరియు అలజడి సృష్టించేందుకు ఈ ఆయుధాలను దాచినట్లు అధికారులు గుర్తించారు.
ఈ సోదాలలో అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిళ్లు, చైనా తయారీ పిస్టళ్లు, పెద్ద సంఖ్యలో లైవ్ బుల్లెట్లు మరియు ఐఈడీ (IED) తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ భారీ కుట్రను భగ్నం చేయడం భద్రతా దళాల పెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా సైన్యం అదనపు బలగాలతో గాలింపు చర్యలను (Search Operations) మరింత ముమ్మరం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi