తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు.23 నుండి 25 వరకు పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు.23 నుండి 25 వరకు పవిత్రోత్సవాలు
Tirumalai Kumaraswamy Temple


అమరావతి, 11 ఆగస్టు (హి.స.)

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే వెల్లడించింది. ఆగస్టు 22న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ఠ, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande