హస్తకళాకారులను ఆదుకోవడానికి ఆరు ప్రముఖ ప్రాంతాలలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు
హస్తకళాకారులను ఆదుకోవడానికి ఆరు ప్రముఖ ప్రాంతాలలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు
హస్తకళాకారులను ఆదుకోవడానికి ఆరు ప్రముఖ ప్రాంతాలలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు

హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే హస్తకళలను మరియు వాటిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులను ప్రోత్సహించేందుకు అటవీ శాఖ సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు మరియు మాధవధార చెక్క వస్తువుల తయారీదారులకు ముడిసరుకు కొరత లేకుండా చూసేందుకు ఒక వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ఆరు ప్రముఖ హస్తకళల కేంద్రాలలో 'క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్' (చెక్క బ్యాంకులు) ఏర్పాటు చేయనున్నట్లు అటవీ మరియు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఈ బ్యాంకుల ద్వారా హస్తకళాకారులకు బొమ్మల తయారీకి అవసరమయ్యే పొనికి కర్ర, తెల్ల పొనికి వంటి ప్రత్యేక రకాల కలపను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే, సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande