ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి, లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి, లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు
prakasham


విజయవాడ 11 ఆగస్టు (హి.స.)

:

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయానికి బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో (వరద రాక) మరియు అవుట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటిని నియంత్రించడానికి బ్యారేజీకి చెందిన దాదాపు 30 కి పైగా గేట్లను పాక్షికంగా ఎత్తి నీటిని దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీనివల్ల కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది.

వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలోని కృష్ణలంక, భూపేష్ గుప్తా నగర్ వంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. దిగువన ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల లంక గ్రామాల ప్రజలు నది దాటడానికి ప్రయత్నించవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదీ తీర ప్రాంతాల్లో 24 గంటల పాటు పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande