ఏపీలో అర్ధరాత్రి వర్షాలు..జలమయమైన కాలనీలు
ఏపీలో అర్ధరాత్రి వర్షాలు..జలమయమైన కాలనీలు
Rain


నంద్యాల, 11 ఆగస్టు (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం పడింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి వర్షం దంచి కొడుతూనే ఉంది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, అదిలాబాద్, అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు వర్షాలు పడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande