
కదిరి , 11 ఆగస్టు (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నల్లచెరువు మండల కేంద్రంలో గల పలు కాలనీలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం కాలనీవాసులు స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
గత నెల రోజులుగా పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాగునీటి సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈఓఆర్డీ,పంచాయతీ కార్యదర్శి, అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఆగ్రహించిన కాలనీవాసులు ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేశారు.
నిరసన సమయంలో ఎంపీడీవో అశోక్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈఓఆర్డీ , పంచాయతీ కార్యదర్శి, కాలనీవాసులతో మాట్లాడి కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందిన కాలనీవాసులు తమ నిరసనను విరమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV