పార్లమెంట్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ వివాదం, ప్రతిపక్షాల ఆందోళనలతో స్తంభించిన ఉభయ సభలు
పార్లమెంట్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ వివాదం, ప్రతిపక్షాల ఆందోళనలతో స్తంభించిన ఉభయ సభలు
PARLIAMENT MONSOON SESSION


న్యూఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.)

ఢిల్లీలో కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి అంశంపై తీవ్ర రచ్చగా మారాయి. జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై పెల్లెట్ గన్లు, మేకులు గుచ్చిన లాఠీలను ఉపయోగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులపై అణచివేత చర్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, ఈ నిరసనలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, హోంమంత్రి అమిత్ షా స్వయంగా సభలో ప్రకటన చేస్తారని స్పష్టం చేశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని, అలాగే రామాలయ నిధుల దుర్వినియోగంపై కూడా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడాల్సి వచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande