
తిరుపతి, 12 ఆగస్టు (హి.స.)
తిరుపతి(తితిదే), తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపేయనున్నట్లు తితిదే ప్రకటించింది. గురువారం దర్శనానికి బుధవారం జారీ చేసే టోకెన్లు ఇవ్వరని.. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం దర్శనానికి గురువారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేస్తారని తెలిపింది. టోకెన్ల జారీ నిలిపివేతపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో తితిదే ఈ విధానాన్ని వరుసగా ఏడు బుధవారాల నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం ఆరు గంటలకే పది వేల ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేశారు. వీరికి బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు 2 వేల టోకెన్లు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ