శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామంటూ భక్తులను టిటిడి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగిస్తున టిటిడి ఉద్యోగి. గిరిధర్ అరెస్ట్
శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామంటూ భక్తులను టిటిడి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగిస్తున టిటిడి ఉద్యోగి. గిరిధర్ అరెస్ట్
arrest


అమరావతి, 12 ఆగస్టు (హి.స.)

తిరుమల, శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులను, తితిదే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగిస్తున్న తితిదే సస్పెండైన ఉద్యోగి జలకర గిరిధర్ను తిరుమల టూటౌన్ పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీరాముడు కథనం మేరకు.. తిరుపతిలోని కోలా వీధికి చెందిన జలకర గిరిధర్ తితిదే సబార్డినేట్ ఉద్యోగి. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. తాను తితిదేలో పేష్కార్నని, సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడి నుంచి ఫోన్ పేలో రెండు దఫాల్లో రూ.1,56,000 నగదు బదిలీ చేయించుకున్నాడు. ఈఏడాది మే 24న టికెట్ల కోసం భక్తులు ఎస్ఎంసీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత గిరిధర్ మొబైల్ స్విచ్ఆఫ్ చేసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తిరుపతికి చెందిన ఓ నిరుద్యోగికి తితిదేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3,60,000 తీసుకొని మోసం చేసినట్లు తేలింది. రెండు కేసులపై నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande