
సంగారెడ్డి జిల్లా: , 12 ఆగస్టు (హి.స.)
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక పరిధిలో కాలుష్య నియంత్రణ మండలి (PCB) మరియు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక పాత గోదాంలో భారీ ఎత్తున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను మరియు నిషేధిత కవర్లను నిల్వ ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ దాడుల్లో సుమారు 4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను స్వాధీనం చేసుకుని, సదరు గోదామును అధికారులు సీజ్ చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే ఇటువంటి ప్లాస్టిక్ తయారీ మరియు నిల్వ కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. గోదాం యజమానిపై కేసు నమోదు చేసి రూ. 2 లక్షల జరిమానా విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi